మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తీసే డైరక్టర్ కొరటాల శివ తన సెంటిమెంట్ ని వదిలి పెట్టనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం అత్యధిక వసూళ్లను రాబట్టి ప్రిన్స్ ని టాలీవుడ్ నంబర్ వన్ హీరో గా నిరూపించింది.
మళ్లీ కొరటాల, మహేష్ కాంబినేషన్లో మూవీ రానుంది. ఈ ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల బిజీగా ఉన్నారు. జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ ద్వారా దర్శకుడు కొత్త రూట్ లో వెళ్లనున్నారు. ఆయన గత చిత్రాల్లో హీరో తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉండేది. మిర్చిలో సత్యరాజ్, శ్రీమంతుడులో జగపతిబాబు, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ రోల్స్ బాగా పవర్ ఫుల్ గా మలిచారు. అటువంటి పాత్రని తన సినిమాలో పెట్టడం కొరటాలకు తొలి చిత్రం సెంటిమెంట్ గా వస్తోంది.
అయితే ఈ సారి అటువంటి పాత్రను తన సినిమాలో పెట్టదలుచుకోవడం లేదని తెలిసింది. సినిమా మొత్తం మహేష్ బాబు ఒక్కడే నడిపించేలా కథను రాసుకున్నట్లు సమాచారం. మరి ఈ రూట్ లో కొరటాల ఎంత మేర సక్సస్ అవుతారో..!!