ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రికార్డ్స్ దుమ్ముదులిపిన మహేష్

  • June 1, 2020 / 01:38 PM IST

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయింది. ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే కొత్త చిత్ర ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ లుక్ లో ముందెప్పుడూ చూడని మాస్ లుక్ తో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు. కాగా ఈ ఫ్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో అనేక రికార్డ్స్ నమోదు చేసింది.

24 గంటల్లో మోస్ట్ రీట్వీట్ చేసిన ప్రీ లుక్ , అలాగే మోస్ట్ లైక్స్ వచ్చిన ప్రీ లుక్ రికార్డ్స్ తో పాటు మోస్ట్ ట్వీట్ చేసిన యాష్ ట్యాగ్ గా ఇండియా లెవెల్ లో రికార్డులు నమోదుచేసింది. టైటిల్ లోగోతో పాటు మహేష్ లుక్ వారికి విపరీతంగా నచ్చడంతో ఫ్యాన్స్ ట్వీట్స్ మరియు రీట్వీట్స్ తో విరుచుకుపడ్డారు.దీనితో దేశంలోనే తక్కువ టైములో వన్ మిలియన్ ట్వీట్స్ చేసిన టైటిల్ ట్యాగ్ గా కూడా సర్కారు వారి పాట నిలిచింది.

ఇక సర్కారు వారి పాట సినిమా ఎలా ఉంటుందో అనే విషయంలో కూడా మహేష్ ఫ్యాన్స్ కి ఓ హింట్ ఇచ్చారు. ఈ సినిమా స్ట్రాంగ్ మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను, అని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదలయ్యే సూచనలు కలవు.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus