ఫామ్ హౌస్ ను కూతురికి చూపించిన నమ్రత

  • January 29, 2018 / 09:59 AM IST

సెలబ్రిటీల కుటుంబంలో పుట్టిన పిల్లలకు.. ఇతర పిల్లలు మాదిరి లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే వారికి సెలబ్రిటీ స్టేటస్ తో పాటు.. రక్షణ (సెక్యూరిటీ) అడ్డుగా నిలుస్తుంది. అందుకే ఏసీ గదుల్లో నుంచే ప్రపంచాన్ని చూస్తుంటారు. సాధారణ లైఫ్ ని తమ పిల్లలు మిస్ కాకూడదనేది మహేష్, నమ్రతల కోరిక. ఓ వైపు సెలబ్రిటీ పిల్లలా పెంచుతూనే.. సంస్కృతి సంప్రదాయాన్ని నేర్పిస్తున్నారు. బాల్యం లో తెలుసుకోవాల్సినవి వీడియో రూపంలో కాకుండా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. గత వేసవి సెలవుల్లో నమ్రతకు మట్టి కుండలు చేయడంలో సితారకు శిక్షణ ఇప్పించిన నమ్రత.. తాజాగా ఫామ్ హౌస్ ఎలా ఉంటుందో చూపించారు.

అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుందో చూసి ఈ చిన్నారి మురిసి పోయింది. ఆవు వద్ద పాలు తాగుతున్న లేగదూడను చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో నమ్రత కూతురి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “పిల్లలకు ప్రాథమిక అంశాలు కూడా తెలియాలి. అదే ఉద్దేశ్యంతో సితారను ఫామ్ హౌస్ కు తీసుకెళ్లాను” అని నమ్రత పోస్ట్ చేసింది. ఇలా తల్లిగా నమ్రత చేయాల్సిన పనులను ఒకటి కూడా మిస్ కాకుండా చేస్తోంది. తండ్రిగా మహేష్ కూడా దొరికిన సమయం మొత్తాన్ని పిల్లల్తో గడపడానికి కేటాయిస్తుంటారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న భరత్ అనే నేను షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 27 రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus