సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శ్రీమంతుడు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్ సాధించింది. దీంతో వీరి కలయికలో రానున్న రెండో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగా కొరటాల స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఆ స్క్రిప్ట్ పై డిస్కషన్ కోసం వారం రోజులక్రితం హీరో, డైరక్టర్ మలేషియా వెళ్లారు. నిన్నటితో డిస్కషన్ పూర్తయింది. ఇద్దరూ హైదరాబాద్ కి తిరిగివచ్చారు. మహేష్, మురుగదాస్ మూవీ షూటింగ్ కోసం ముంబయి వెళ్లారు. అయితే ఈ స్క్రిప్ట్ గురించి కొన్ని ఆసక్తికర సంగతులు బయటికి వచ్చాయి. కొరటాల చెప్పిన స్క్రిప్ట్ కి మహేష్ కి థ్రిల్ అయినట్లు సమాచారం.
డైరక్టర్ గత చిత్రాల కంటే ఇది విభిన్నంగా ఉండడమే కాదు. కామెడీ ఎక్కువగా ఉందని తెలిసింది. “భరత్ అను నేను” అనే పరిశీలిస్తున్న ఈ చిత్రంలో ప్రిన్స్ ముఖ్యమంత్రిగా నటించనున్నారు. సీఎం పాత్రకు అధికారులకు మధ్యనున్న సన్నివేశాల్లో పంచ్ లు అదిరి పోవే విధంగా ఉన్నాయని, ఆ సీన్లు మహేష్ ని ఆశ్చర్యపరిచాయని టాక్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ ఏప్రిల్ కి ప్రారంభంకానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.