‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ తో మళ్ళీ మహేష్ అదే బాట..!

మహేష్ బాబు కూడా తమిళ స్టార్ హీరో విజయ్ లానే తయారవుతున్నాడా.. చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఈమధ్య కాలంలో తన ప్రయోగాలకు ఫుల్ స్ఠాప్ పెట్టిన మన సూపర్ స్టార్..వరుసగా కమర్షియల్ ఎలెమెంట్స్ తో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ వంటి హిట్లు అందుకున్నాడు. ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఇదిలా ఉంటే… తన తరువాతి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మళ్ళీ అనిల్ రావిపూడితో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. సాధారణంగా తనకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి ఛాన్స్ లు ఇస్తూనే ఉంటాడు మహేష్. తమిళ స్టార్ హీరో విజయ్ కూడా మురుగదాస్ , అట్లీ వంటి డైరెక్టర్ లతో రిపీట్ గా సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ కూడా అదే బాట లో నడిచే అవకాశం లేకపోలేదు. వంశీ, అనిల్ లు మళ్ళీ మహేష్ కు హిట్లు ఇస్తే… విజయ్ లానే మహేష్ కూడా ఈ ఇద్దరు డైరెక్టర్ ల తోనే సినిమాలు చేస్తూ ఉంటాడేమో..!

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus