సూపర్ స్టార్ కరోనా పరీక్ష రిజల్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను కరోనా వైరస్ తెగ టెన్షన్ పడుతోంది. షూటింగ్ లో పాల్గొన్న ఒక్కరికి కరోనా సోకినా హీరోలు ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ బాబు కరోనా పరీక్షలు చేయించుకోగా పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. మహేష్ కు కరోనా నెగిటివ్ వచ్చిందనే విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

సర్కారు వారి పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబు పర్సనల్ స్టైలిష్ట్ కు కరోనా నిర్ధారణ అయింది. స్టైలిష్ట్ కు పాజిటివ్ రావడంతో మహేష్ బాబు ఐసోలేషన్ లోకి వెళ్లారు. మరోవైపు మహేష్ బాబు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని సమాచారం. పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ కావడంతో త్వరలో మహేష్ రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. స్టార్ హీరో ప్రభాస్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధా కొంగర డైరెక్షన్ లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రమే మహేష్ త్రివిక్రమ్ లేదా మరో డైరెక్టర్ డైరెక్షన్ లో నటించే అవకాశం ఉంటుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట తరువాత మరో సినిమాలో నటించడానికి రాజమౌళి ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus