టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు వరుస విజయాలతో మార్కెట్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మహేష్ బాబుకు వీరాభిమానులు ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే విషయంలో మాత్రం ముందువరసలో ఉంటారు. అయితే మహేష్ బాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ బాబు బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ గ్రామం అభివృద్ధి కొరకు మహేష్ బాబు తన వంతు సహాయం చేస్తూ వస్తున్నారు. బుర్రిపాలెం మహేష్ బాబు సొంత ఊరు కాగా ఆ గ్రామ ప్రజలకు వైద్య సౌకర్యాలతో పాటు కరోనా వ్యాక్సిన్ వేయించే బాధ్యతను మహేష్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు లేదా ఆయన సన్నిహితుల నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి గ్రామంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా మహేష్ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండగా మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పేదల కోసం మహేష్ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.