మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి కల్ట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్- మహేష్ కాంబినేషన్లో రూపొందనున్న మూవీ ఇది. కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ చిన్న గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.. అది యూట్యూబ్ ని షేక్ చేసేసి రికార్డులు సృష్టించింది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాబోతుంది అని మేకర్స్ ముందుగానే ప్రకటించారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. (Mahesh) మహేష్ బాబు తల్లి ఇందిర గారు గత ఏడాది అంటే 2022 సెప్టెంబర్ 28 న మరణించారు. అలాగే మహేష్ తండ్రి కృష్ణ గారు 2022 నవంబర్ 15 న మరణించారు. అలాగే అతని అన్న కూడా అదే ఏడాది జనవరిలో మరణించారు. ఇలా వరుసగా మహేష్ ఇంట్లో బ్యాడ్ న్యూస్ లు చోటు చేసుకున్నాయి.
కాబట్టి కీడు జరిగిన ఇంట్లో ఏడాది తిరగకుండా శుభకార్యం జరగాలి అని పెద్దలు అంటుంటారు. దీంతో మహేష్ బాబు, నమ్రత దంపతులు ఓ నిర్ణయం తీసుకున్నారట. మహేష్ తల్లి ఇందిర గారు బ్రతికున్న రోజుల్లో సితారకి ఓణీల ఫంక్షన్ ఘనంగా చేయాలని భావించేవారట. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు కుదర్లేదు.
అయితే ఇప్పుడు ఆమె చివరి కోరికని తీర్చాలని మహేష్, నమ్రత దంపతులు భావిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సితార ఓణీల ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దల అందరినీ ఆహ్వానించాలని మహేష్ భావిస్తున్నట్టు సమాచారం.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!