Mahesh, NTR: డిసెంబర్ పై దృష్టి పెట్టిన మహేష్, తారక్.. విజేత ఎవరో?

  • February 19, 2023 / 02:29 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్, తారక్ అంచనాలకు మించి క్రేజ్ ఉండగా వరుస విజయాలతో ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. మాస్ ప్రేక్షకుల్లో ఈ ఇద్దరు హీరోలకు ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉండగా క్లాస్ ప్రేక్షకులలో కూడా అంచనాలకు మించి క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకునే దిశగా ఈ హీరోలు అడుగులు వేస్తున్నారు. మహేష్ బాబు ఈ ఏడాది డిసెంబర్ నుంచి రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో డిసెంబర్ నుంచి పాల్గొననున్నారు. డిసెంబర్ లో షూట్ మొదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అటు రాజమౌళి ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరూ స్టార్ డైరెక్టర్లే కాగా ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

ఈ ఇద్దరు హీరోల పారితోషికం వేర్వేరుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఈ ఇద్దరు హీరోలు తమతో పని చేసిన డైరెక్టర్లను మార్చుకుంటున్నారని కొంతమంది సరదాగా కామెంట్లు చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చేయాలని ఉందని ఒక సందర్భంలో మహేష్ బాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది.

జూనియర్ ఎన్టీఆర్, మహేష్ మరెన్నో విజయాలను సొంతం చేసుకుని కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మహేష్, తారక్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus