Mahesh Babu, Jr NTR: ఎవరు మీలో కోటీశ్వరులు… బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కు బ్లాక్ బస్టర్ గ్లిమ్ప్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి మరో స్టార్ హీరో మహేష్ బాబు రాబోతున్నట్టు ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై కొన్ని ఫోటోలు లీకైనప్పుడు మహేష్ బాబుని అడిగితే… ‘అదేదో వాళ్ళే చెబుతారు లెండి’ అంటూ మాట దాటేశాడు. తర్వాత దీని గురించి ఊసే లేదు. మధ్యలో రాజమౌళి, సమంత, కొరటాల శివ,దేవి శ్రీ ప్రసాద్, తమన్ వంటి వాళ్ళు వచ్చి సందడి చేసి వెళ్లారు.

అయితే ఈ మధ్యనే మహేష్ బాబు ఎపిసోడ్ కు సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేశారు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ మేకర్స్. తాజాగా దానికి సంబంధించిన గ్లిమ్ప్స్ ను కూడా విడుదల చేశారు. 39 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లిమ్ప్స్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కనిపించింది 20 సెకండ్లే. అయినప్పటికీ ఆ 20 సెకండ్లలోనే అభిమానులకి బోలెడంత ఎంటర్టైనింగ్ స్టఫ్ ఇచ్చారు ఈ స్టార్ హీరోలు. ‘వెల్కమ్ మహేష్ అన్నా’ అంటూ ఎన్టీఆర్…

మహేష్ కు వెల్కమ్ చెప్పడం ఆ వెంటనే ‘అదిరిపోయింది సెటప్ అంతా’ అంటూ మహేష్ బాబు తనదైన బ్రాండ్ డైలాగ్ పలకడం, అటు తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ‘నా రాజా’ అంటూ మహేష్ ను అనడం, చివరికి ‘కరెక్ట్ ఆన్సర్ దాన్ని తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఎందుకు’ అంటూ మహేష్ అనడం దానికి ‘సరదాగా’ అంటూ ఎన్టీఆర్ బదులివ్వడం.. ఇవన్నీ ఈ ఇద్దరు హీరోల అభిమానులకి ఐ ఫీస్ట్ లా అనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus