ఈ మధ్య జనాలు థియేటర్లకు రావడం లేదు. అందరు నిర్మాతలు, బయ్యర్స్ చెప్పే మాట ఇదే. ఓటీటీలకు అలవాటు పడిపోవడం వల్ల జనాలు థియేటర్లకు వచ్చే మూడ్ లేరు. ఎంతసేపు ఇదే మాట చెబుతున్నారు మేకర్స్. మరి పాత సినిమాలు రీ- రిలీజ్ చేస్తుంటే ఆడియన్స్ ఎందుకు థియేటర్లకు వెళ్తున్నారు. ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు? ఇది ఒక్క దర్శకుడు, నిర్మాత ఆలోచించడం లేదు. ఇటీవల ఓ నిర్మాతని దీని గురించి ప్రశ్నిస్తే..
‘పెద్ద హీరోల సినిమాలు రీ- రిలీజ్ చేస్తే వెళ్తున్నారులే’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. కేవలం పెద్ద హీరోల సినిమాల రీ- రిలీజ్..లకే జనాలు థియేటర్లకి వెళ్తున్నారు అనే అతని అభిప్రాయం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో ప్లాప్ అయిన ‘ఓయ్’ (Oye) వంటి సినిమాలు కూడా రీ- రిలీజ్లో బాగా కలెక్ట్ చేశాయి. సో ఇక్కడ కంటెంట్ బాగున్న సినిమాలను రీ- రిలీజ్ చేసినా జనాలు థియేటర్లకు వెళ్తారు అని ప్రూవ్ అయ్యింది.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈరోజు ‘భైరవం’ (Bhairavam) సినిమా రిలీజ్ అయ్యింది. కానీ దీనికి 20,30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేవు. కానీ రీ రిలీజ్ అయిన మహేష్ బాబు (Mahesh Babu) ‘ఖలేజా’ (Khaleja) సినిమాకి మాత్రం హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. పలుచోట్ల 60 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. ఒకవేళ ‘ఖలేజా’ కనుక ఈరోజు లేకపోతే ‘భైరవం’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చేవి అని… ఆంధ్ర సైడ్ బయ్యర్స్ ఉసూరుమంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను జనాలు పక్కన పెట్టరు.
సో ముందుగా మేకర్స్ జనాలను ఆకర్షించే కంటెంట్ పై దృష్టి పెట్టాలి. అయితే కొత్త రిలీజ్ లు ఉన్నప్పుడు పెద్ద హీరోల పాత సినిమాలు రీ- రిలీజ్ చేసినా ఇబ్బందే..! ‘భైరవం’ మాత్రమే కాదు ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) రీ- రిలీజ్ అయ్యింది. దానికి కూడా ఇదే ఇబ్బంది ఎదురైంది. సో పెద్ద హీరోల రీ- రిలీజ్ సినిమాలు ఏ మంగళవారం నాడో లేదంటే బుధవారం నాడో ప్లాన్ చేసుకుంటే మంచిది.