Mahesh: ‘దసరా’ మూవీ పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ నిన్న అంటే మార్చ్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పాన్ ఇండియన్ మూవీ కాబట్టి తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీ ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు అద్భుతమైన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ‘దసరా’ మూవీ.

తాజాగా ఈ చిత్రం పై మహేష్ బాబు ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈరోజు ప్రత్యేకంగా ‘దసరా’ మూవీని వీక్షించిన మహేష్ బాబు అనంతరం తన సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘దసరా మూవీ చూసాను స్టన్నింగ్ ఫీలింగ్ కలిగింది, నిజంగా అందరూ గర్వపడాల్సిన సినిమా’ అంటూ పోస్ట్ చేశాడు.

ఈ క్రమంలో మహేష్ (Mahesh) పోస్ట్ కు దసరా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తో పాటు ‘శ్రీలక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్’ టీమ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.అలాగే నాని అభిమానులు కూడా మహేష్ బాబుకి థాంక్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.తన సినిమాలపై మాత్రమే కాకుండా పక్క సినిమాల పై కూడా మహేష్ బాబు ఇలా పోస్టులు పెట్టడం కొత్త విషయం ఏమీ కాదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus