టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా ‘రావు బహదూర్’ అనే సినిమా రూపొందింది. కొంత గ్యాప్ తర్వాత వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘A+S మూవీస్’ ‘శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్’ ‘మహయాన మోషన్ పిక్చర్స్’ సంస్థలపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింత గోపాల కృష్ణారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా ‘జిఎంబి ఎంటర్టైన్మెంట్’ పై మహేష్ బాబు(Mahesh Babu) కూడా సమర్పకుడిగా వ్యవహరించాడు.
ఇటీవల మహేష్ బాబు ఈ చిత్రాన్ని వీక్షించినట్టు నిర్మాతల్లో ఒకరైన చింత గోపాల కృష్ణారెడ్డి తెలిపారు. తాజాగా మహేష్ బాబు ‘రావు బహదూర్’ పై రివ్యూ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రిలో హాట్ టాపిక్ అయ్యింది.తన ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు స్పందిస్తూ.. “రావ్ బహదూర్ అనేది పైపై మెరుపులతో ముస్తాబైన సినిమా కాదు. మనసుకు బలంగా హత్తుకునే అద్బుతమైన సినిమా. ఈ కథ కోసం దర్శకుడు వెంకటేష్ మహా సృష్టించిన వరల్డ్ అద్బుతం.
హీరో సత్యదేవ్ దేవ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అతను నటించినట్టు కాదు జీవించినట్టే అనిపించింది. హీరోయిన్ దీపా థామస్ తన సహజమైన నటనతో కట్టిపడేసింది. అద్భుతమైన తారాగణం, ఆకట్టుకునే సాంకేతిక నిపుణుల పనితీరు ఈ సినిమాకి ప్రధాన బలం. ఇంత అద్భుతమైన ఔట్పుట్ అందించిన చిత్రబృందాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది” అంటూ పేర్కొన్నాడు. మహేష్ బాబు రివ్యూతో ‘రావు బహదూర్’ పేరు మార్మోగుతోంది.
సినిమా నచ్చకపోతే మహేష్ బాబు ఇంత లెంగ్తీ ట్వీట్ వేసే అవకాశం లేదు. ఇంత కాన్ఫిడెంట్ గా మహేష్ బాబు ట్వీట్ చేశాడు అంటే ‘రావు బహదూర్’ లో సంథింగ్ స్పెషల్ ఉన్నట్టే. జూలై 3 కోసం ఎదురుచూద్దాం..!