సింప్లీ ఐ లవ్ ఇట్ : మహేష్ బాబు

ప్రేమ కథా చిత్రమ్ తర్వాత యువ హీరో సుధీర్‌బాబుకి చెప్పుకోదగ్గ హిట్ లేదు. మళ్ళీ ఇంతకాలానికి సమ్మోహనం రూపంలో హిట్ అందుకున్నారు. గ్రహణం, అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత.. చిత్రాల డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ  దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఈ చిత్రాన్ని చూసిన మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికపై పంచుకున్నారు.  “సుధీర్ బాబు సమ్మోహనంలో అదిరిపోయే నటన ప్రదర్శించారు.  అదితిరావు తన కెరీర్ లోనే అత్యుత్తమమైన నటనగా ఇది నిలిచిపోతుంది. నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

అతని నటన బ్రిలియంట్. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు ” అని ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ పై అభినందనలు గుప్పించారు. “డైరక్టర్ సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దారు. అద్భుతంగా డైరెక్ట్ చేశారు. మన పరిశ్రమలో అత్యద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఆయన ఒకరు. సమ్మోహనం గురించి మాటల్లో చెప్పలేను. సింప్లీ ఐ లవ్ ఇట్” అని మరో ట్విట్‌లో చెప్పారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న సినిమాకి మహేష్ ప్రశంసలు మరింత ప్లస్ కానున్నాయి. మహేష్ ట్వీట్స్ కి అదితిరావు ఆనందంతో రీ ట్వీట్ చేశారు. ” థ్యాంక్యూ థ్యాంక్యూ మహేష్‌బాబు. మీ నుంచి ఇలాంటి స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉంది” సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus