గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్2’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం నిర్మాత దిల్ రాజుకి 50 కోట్ల పైనే లాభాల్ని అందించింది. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సీక్వెల్ రాసే పనిలో ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. దీనికి దిల్ రాజు కూడా ఓకే చెప్పారని కూడా టాక్ నడిచింది. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రవితేజ ప్లేస్ లో మహేష్ వచ్చి చేరినట్టు తెలుస్తుంది.
ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను మహేష్ కు ఇచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దీంతో మహేష్.. ‘ఎఫ్3’ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుండీ మహేష్ బాబు ట్రాక్ ఉంటుందని సమాచారం. దాదాపు 40 నిమిషాల వరకూ మహేష్ పాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయట. అదే కానీ జరిగితే.. మరో పెద్ద మల్టీ స్టారర్ చిత్రాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది. ఇదెలా ఉన్నా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ మరో చిత్రం చేయడానికి నిస్సందేహంగా రెడీగా ఉన్నాడని తెలుస్తుంది.