Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్ సినిమా.. క్లారిటీ వచ్చేసింది
- August 21, 2026 / 03:27 PM ISTByFilmy Focus Desk
మొన్నీ మధ్యే ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ఏఐ వీడియో సిద్ధం చేయించి మరీ విషెస్ చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రముఖ కథానాయకుడు, మహేష్‌బాబు తండ్రి దివంతగ కృష్ణ సినిమాలోని ఓ డైలాగ్‌ను మహేష్‌బాబు చెప్పినట్లు ఏఐలో సృష్టించారు. అంత కష్టపడి ఆ వీడియో చేయడం వెనుక.. ‘తర్వాతి సినిమాను సందీప్.. మహేష్‌తోనే చేస్తారు కాబట్టి’ అనే కారణం ఉంది అనుకున్నారంతా.
Maheshbabu – Sandeep Vanga
నిజమే అయి ఉంటుంది లెండి. ఎందుకంటే ‘స్పిరిట్’ లాంటి పెద్ద సినిమా చేస్తున్న ఈ రోజుల్లో సందీప్ అండ్ టీమ్ అంత టైమ్ తీసుకొని మరీ ఆ వీడియో చేశారు అంటే.. కచ్చితంగా తమ నెక్స్ట్ హీరోకు ఆ మాత్రం స్పెషల్ విషెస్ చెప్పాలి కదా అనే ఆలోచన ఉండే ఉంటుంది. అయితే ఆ ప్రాజెక్ట్‌ను ఎక్కడా, ఎవరూ ఇంకా ప్రకటించలేదు. ఇదే విషయంలో సందీప్ సోదరుడు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా దగ్గర ప్రస్తావిస్తే.. అవకాశం ఉంది.. సందీప్ మాట్లాడుతున్నాడు అంటూ చూచాయగా చెప్పేశారు.

ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘స్పిరిట్’ సినిమా తర్వాత సందీప్.. ‘యానిమల్’ సినిమా సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ చేయాల్సి ఉంది. ఈ లోపు రణ్‌బీర్ ‘రామాయణ’ పనులు పూర్తి చేసుకొఇ రెడీగా ఉంటాడు. ఆ తర్వాతనే సందీప్ మరో సినిమా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సినిమా తర్వాతే మహేష్‌బాబు సినిమా ఉంటుంది అని ప్రణయ్ చెప్పకనే చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎక్కడా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు అని క్లారిటీ ఇచ్చేశారు.
పైనేదో బర్త్‌డే విషెస్ అన్నారు ఏంటది అనుకుంటున్నారా.. కృష్ణ నటించిన ‘కిరాయి కోటిగాడు’ సినిమాలోని ఓ హిట్ ట్రేడ్ మార్క్ డైలాగ్‌ని అందులో మహేష్‌తో చెప్పించారు. అదే ‘ఊరు తెనాలి.. ఉద్యోగం కిరాయి ఉంచుకుని కాళ్లు, చేతులు విరగొట్టం.. వివరాలు చాలుగా’ అనే డైలాగ్. అన్నట్లు గతంలో ఈ కాంబో గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘డెవిల్’ అనే ప్రాజెక్ట్ పేరు వినిపించింది.















