Sai Pallavi: సూపర్ సెంతామరయ్.. మూడుకు మూడు డిఫరెంట్.. ఎలా ఎలా?
- November 28, 2026 / 03:41 PM ISTByFilmy Focus Desk
ఒక హీరో గురించి, అతని సినిమాల గురించి మాట్లాడినప్పుడు కచ్చితంగా చర్చకు వచ్చే అంశం ‘జోనర్’. వరుస జోనర్లలో, వివిధ రకాల పాత్రలు చేస్తూ హీరోలు తమలోని వెర్సటాలిటీని బయటకు తెస్తున్నారు అని మెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ మాట హీరోయిన్ల విషయంలో ఎక్కువగా వినిపించదు. ఎన్ని రకాల పాత్రలు చేసినా.. ఆమె నుండి ఓ కొత్త సినిమా వచ్చింది అనే మాట మాత్రమే అంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది.
Sai Pallavi
ఇప్పుడు హీరోయిన్లు ఎలాంటి పాత్రలు చేస్తున్నారు, వాటి జోనర్ ఏంటి, అందులో ఎలా చేశారు, ఆ సినిమాల్లో ఆ పాత్ర ప్రత్యేకత ఏంటి? అనే చర్చలు చేస్తున్నారు. అలా మాట్లాడుకునే హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సాయిపల్లవి సెంతామరయ్.. రీసెంట్ టైమ్స్‌లో చేసిన మూడు సినిమాలు చూస్తే.. ‘ఇల ఎలా..’ అని అనిపించక మానదు. కావాలంటే రీసెంట్ మూడు సినిమాల్లో ఆమె పాత్రలు చూసుకోండి.
ఈ ఏడాది సాయి పల్లవి నుండి మూడు సినిమాలు వచ్చాయి. తొలి సినిమా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘ఏక్ దిన్’. ఈ సినిమాలో ప్రేమికురాలిగా సాయిపల్లవి అదరగొట్టింది. సినిమా ఫలితం బెదరగొట్టింది అనుకోండి. ఇక ‘రామాయణ’ సినిమాలో సీత పాత్ర లుక్స్ గురించి ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆమె నటన మీద ఒక్క మాట కూడా రాలేదు. ఇక మొన్నీ మధ్య ఆమె నుండి వచ్చిన ‘ఓ.ఎం’లో కూడా ఆమె పాత్ర డీఎస్పీ నిత్యా రెడ్డికి మంచి పేరే వచ్చింది.
ఇప్పుడు ఆమె నుండి రానున్న చిత్రం ‘ఇంజి వెల్లం’/ ‘అల్లం బెల్లం’. మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి సరసన విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రేమలో మణి సార్ స్టైల్ ప్రేమకథ అని చెబుతున్నారు. ఇప్పటికే వచ్చిన ఆమె లుక్ అదిరిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా వరుస సినిమాల్లో కొత్త కొత్త జోనర్లను టచ్ చేస్తోంది. అయితే ఫలితాలు కూడా బాగా వస్తే.. ఆమె ఇంకా ప్రయోగాలకు సిద్ధమవుతుంది.
















