Mahesh Babu, Rajamouli: జక్కన్న అన్నేళ్లు తీసినా ఓకే అంటున్న సూపర్ స్టార్!

  • May 11, 2022 / 12:13 PM IST

మహేష్ జక్కన్న కాంబో మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి సినిమాకు సంబంధించి మహేష్ బాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహేష్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ చాలా సింపుల్ గా ఉంటారని జగన్ ను నేరుగా కలిసిన సమయంలోనే ఆయన సింప్లిసిటీ తనకు అర్థమైందని మహేష్ బాబు కామెంట్లు చేశారు. సీఎం జగన్ కు అన్ని విషయాల గురించి అవగాహన ఉందని మహేష్ బాబు పేర్కొన్నారు.

రాజమౌళితో ఒక మూవీ అంటే పాతిక సినిమాలతో సమానమని రాజమౌళి ప్రాజెక్ట్ కు రెండేళ్ల సమయం కేటాయించినా తాను ఫీల్ కానని మహేష్ బాబు కామెంట్లు చేశారు. సితార సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటంపై గౌతమ్ ఆట పట్టిస్తాడని గౌతమ్, సితార ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయని మహేష్ అన్నారు. గౌతమ్ ఇష్టాన్ని బట్టి సినిమాల్లోకి రావడం రాకపోవడం ఉంటుందని మహేష్ కామెంట్లు చేయడం గమనార్హం.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తను హీరోగా నటించబోయే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మహేష్ బాబు వెల్లడించారు సర్కారు వారి పాటలో తన పాత్ర పోకిరి మూవీ రోల్ కు దగ్గరగా ఉంటుందని మహేష్ బాబు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో ఇష్టమైన వాళ్లను కోల్పోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యానని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. కృష్ణగారి బయోపిక్ అనే మాట వింటే తనకు వణుకు పుడుతుందని మహేష్ బాబు కామెంట్లు చేశారు.

కళావతి పాట ట్యూన్ ను మొదట ఓకే చేయలేదని అయితే థమన్ పట్టుబట్టి ఆ ట్యూన్ ను ఉంచారని మహేష్ బాబు తెలిపారు. థమన్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి సంగీతం అందించాడని మహేష్ బాబు పేర్కొన్నారు. మరికొన్ని గంటల్లో సర్కారు వారి పాట థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus