ఆ విషయంలో మహేష్ … పవన్ నే ఫాలో అయితే బెటర్..!

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే సెపరేట్ అని చెప్పాలి. ఈ ఇద్దరు హీరోలకు లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాకి హిట్ టాక్ వస్తే .. వీళ్ల సినిమాలు సంచలనాలు సృష్టిస్తాయి. అయితే ప్లాప్ టాక్ వచ్చినా అదే రేంజ్ లో నిరాశపరుస్తాయి అనడంలో సందేహం లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తే అది ‘బాహుబలి సిరీస్’ ను మించి హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సినిమా సంగతి పక్కన పెడితే.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఒకే వేదిక పై కనిపించినా చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఓ విషయంలో మాత్రం పవన్ ను చూసి మహేష్ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. అదేంటంటే.. సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్ లను రాబట్టినా.. పవన్ ఆ చిత్రం కలెక్షన్ లను పోస్టర్ ల పై వేయడానికి ఇష్టపడడంట. కానీ మహేష్ మాత్రం తన సినిమా కలెక్షన్లు రికార్డులను పోస్టర్ ల పై వేయడానికి అడ్డు చెప్పడు. అంతేకాదు తన సినిమాకి కలెక్షన్ లు ఇంత వచ్చాయి.. అంత వచ్చాయి.. రికార్డులు కొట్టాయి అంటూ స్టేజి పై డబ్బా కొట్టుకుంటాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మహేష్ సెలెక్ట్ చేసుకునే కాన్సెప్ట్ లు మిగిలిన హీరోల అభిమానులకి కూడా బాగా నచ్చుతాయి. కానీ ఇలా కలెక్షన్లు, రికార్డులు అంటూ తన మంచి సినిమాల స్థాయిని తనే తగ్గించుకుంటున్నాడు అనే వాదన కూడా ఉంది. ఈ విషయంలోనే మహేష్ కూడా పవన్ నే ఫాలో అవ్వడం బెటర్ అనేది కొందరి ఉద్దేశం కావచ్చు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus