తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సస్ ఫుల్ నిర్మాత ఎవరయ్యా అంటే.. మొదటగా దిల్ రాజు పేరు చెబుతారు. ఆయన గత ఏడాది నిర్మించిన శతమానం భవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ సినిమాలు మంచి కలక్షన్స్ రాబట్టాయి. నిర్మాతగా లాభాలను చూసిన దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్స్ గా భారీగా నష్టపోయారు. “ఓం నమో వేంకటేశాయ”, స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాల నైజాం థియేటర్ రైట్స్ ని భారీ ధరకు కొని దెబ్బతిన్నారు. ముఖ్యంగా స్పైడర్ సినిమా ఎక్కువగా నష్టాన్ని మిగిలిచింది. ఈ విషయం మహేష్ బాబు గుర్తు పెట్టుకొని దిల్ రాజుని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న “భరత్ అనే నేను” సినిమా నైజాం థియేటర్ రైట్స్ డిస్కౌంట్ రేటుతో దిల్ రాజుకు ఇప్పించడానికి నిర్మాత డీవీవీ దానయ్యతో చర్చలు చేస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. దిల్ రాజు మాత్రమే కాకుండా స్పైడర్ ని కొన్న ఇతర ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆదుకునేందుకు మహేష్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భరత్ అనే నేను ఫస్ట్ ఓత్ రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.