పర భాషా పోటీలో మహేష్, ప్రభాస్ లలో గెలుపు ఎవరిది?
- May 17, 2017 / 11:05 AM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్స్ తెలుగు భాషకే పరిమితం కావడం లేదు. ఇతర భాషల్లోనూ దూసుకుపోతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో పాపులర్ అయినా తెలుగు హీరోగా ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతను నటించిన బాహుబలి హిందీ వెర్షన్ మాతృకకంటే ఎక్కువ వసూలు చేసింది. అయితే అది ఒక్క ప్రభాస్ గొప్పతనమని ఇప్పుడే చెప్పలేము. అయినా పక్క రాష్ట్రాల్లో జెండా పాతిన తెలుగు హీరోగా ప్రభాస్ నిలిచారు. ఇక అదే బాటలో మహేష్ బాబు పయనిస్తున్నారు. తన సినిమాలను డబ్బింగ్ చేయకుండా ఏకంగా ఒకేసారి రెండు భాషల్లో స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ ద్వారా కోలీవుడ్ లోకి డైరక్ట్ గా మహేష్ అడుగు పెట్టబోతున్నారు. అదే విధంగా ప్రభాస్ బాహుబలి తర్వాత ‘సాహో’ మూవీ చేస్తున్నారు. ఇది త్రిభాషా చిత్రం. ఈ సినిమాతో ప్రభాస్ తనను తాను నిరూపించుకున్నారు. ఈ విధంగా ప్రభాస్, మహేష్ పరభాషా పోటీలో దిగుతున్నారు. ఎవరు విజయం సాధిస్తారోనని ఇప్పటి నుంచే సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. అందుకే స్పైడర్, సాహో సినిమాల కోసం మహేష్, ప్రభాస్ బాగా కష్టపడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















