గాయంతోనే షూటింగ్ చేసిన మహేష్..!

ప్రిన్స్ మహేష్ బాబు…ఈ పేరు వింటేనే అభిమానులు అభిమానంతో ఉప్పొంగిపోతారు…అలాంటి ప్రిన్స్ మహేష్ సినిమా వస్తుంది అంటే ఇక వాళ్ళకి పండగ అనే చెప్పాలి. తాజాగా రిలీజ్ అయిన ప్రిన్స్ మహేష్ స్పైడర్ పై రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ, ఈ సినిమా మంచి వసూళ్ళనే అందుకుంటూ ముందుకు సాగుతుంది…అయితే ఒక పక్క తమిళ సినిమాలాగా ఉంది అన్న రూమర్ ఉన్నప్పటికీ, మరో పక్క డిఫరెంట్ సినిమా అన్న టాక్ సైతం బలంగా వినిపిస్తుంది…ఇదిలా ఉంటే…తెలుగులో పరిస్థితి ఎలా ఉన్నా సరే తమిళంలో మాత్రం సినిమా మంచి వసూళ్లనే రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి…అదే క్రమంలో తమిళ మార్కెట్ మీద పట్టు సాధించాలనే మహేష్ కోరిక ఈ స్పైడర్ సినిమాతో నెరవేరిందని చెప్పవచ్చు.

ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ లో మహేష్ అదరగొట్టేశాడు. అయితే ఈ యాక్షన్ సీన్స్ విషయంలోనే ఒక విషయం బయటపడింది…అదేంటి అంటే…ఈ సన్నివేశాలన్ని దాదాపు మహేష్ మోకాలి నొప్పితోనే చేశాడట. అదేంటి కాలో నొప్పితో ఏంటి అంటారా….అయితే ఒకసారి ఈ మ్యాటర్ చదవండి…మీకే అర్ధం అవుతుంది…అవును ఓ యాక్షన్ సీన్ చేస్తున్న సమయంలో ప్రిన్స్ మోకాలికి గాయమైందట డాక్టర్ కు చూపిస్తే సర్జరీ చేయాలని చెప్పారట. సర్జరీ అంటే మళ్లీ 6నెలలు ఆగాల్సి వస్తుందని యూనిట్ కు ఎవరికి చెప్పకుండానే ఆ మోకాలి నొప్పితోనే షూటింగ్ మొత్తం కానిచ్చేశాడట మహేష్. మోకాలినొప్పితోనే సినిమా మొత్తం పూర్తి చేశాడట. నిర్మాతకు అదనపు ఖర్చు ఎందుకని భావించి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. నిర్మాతల మేలు కోరే హీరోగా మహేష్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బహుశా డెడికేషన్ కు అసలైన నిర్వచనం ఇదే అంటారేమో….మొత్తంగా చూసుకుంటే మహేష్ తన తండ్రిలాగానే నిర్మాత హీరో అనిపించుకున్నాడు అని చెప్పక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus