సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పాత సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ఇటీవల రీ రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) అన్‌సీజన్‌లోనూ థియేటర్లలో వసూళ్ల హంగామా చేసేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మురారి (Murari) , బిజినెస్‌మెన్ (Businessman) సినిమాలు సక్సెస్‌ఫుల్ రన్ ఇచ్చిన తర్వాత, మహేష్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ మరింత పికప్ అయ్యింది. ఇప్పుడు మహేష్ బర్త్‌డే కానుకగా ఆగస్టు 9న అతడు మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుందట.
అతడు మహేష్ ఫిల్మోగ్రఫీలో ఓ ట్రెండ్ సెట్టర్ సినిమా. 2005లో రిలీజ్ అయ్యినప్పుడే హిట్ అయినా, అప్పట్లో థియేట్రికల్ బిజినెస్ పరంగా భారీ లాభాలను అందుకోలేకపోయింది. కానీ టీవీ ప్రీమియర్ తర్వాత స్మాష్ హిట్‌గా మారి రికార్డు స్థాయిలో టెలికాస్ట్ అయ్యింది. ఆ తర్వాత డీవీడీ మార్కెట్‌లోనూ అతడుకే డిమాండ్ పెరిగింది. మణిశర్మ (Mani Sharma) సంగీతం, నాజర్ (Nassar) సెంటిమెంట్, సోను సూద్ (Sonu Sood), బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ, త్రిష (Trisha) గ్లామర్ అన్నీ కలిపి అతడుని (Athadu) రీ రిలీజ్‌కు పర్ఫెక్ట్ సినిమాగా మార్చేశాయి.
ఇప్పటికే 4K రీమాస్టర్ పనులు ప్రారంభమయ్యాయని సమాచారం. స్పెషల్ సౌండ్ మిక్సింగ్‌తో మరింత క్రిస్ప్‌గా అనిపించేలా టెక్నికల్ టీమ్ కష్టపడుతోంది. ఈసారి మహేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని మరింత గ్రాండ్‌గా మార్చేందుకు ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. అతడు రిలీజ్ అయితే పూర్తిగా కొత్త సినిమాగా చూస్తారని, ఓ రేంజ్ హైప్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఇప్పటికే పోటీ మొదలైంది. పలు ఏరియాల్లో భారీ ఆఫర్లు వస్తున్నాయని, మురళీ మోహన్ (Murali Mohan) రికార్డు డీల్ క్లోజ్ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్.
ముందుగా అతిథి, టక్కరి దొంగ రీ రిలీజ్ అవ్వొచ్చన్న ఊహాగానాలు ఉన్నప్పటికీ, అతడు మాత్రం స్పెషల్‌గా ఉండబోతోందనే అభిప్రాయం బలంగా ఉంది. మహేష్ బాబు SSMB29 వచ్చేలోపు ఆయన సినిమాల రీ రిలీజ్ హవా మరింత పెరిగేలా కనిపిస్తోంది. గతంలో మురారి, బిజినెస్‌మెన్ రీ రిలీజ్ హిట్ అయినప్పటికీ, అతడు మాత్రం అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టే సినిమా అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి, అతడు 4K రీ రిలీజ్ మరోసారి సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి సెలబ్రేషన్‌గా మారుతుందేమో చూడాలి.