Posani Krishna Murali: పోసానికి బిగ్ రిలీఫ్… కానీ..?

ఇటీవల హైదరాబాద్, రాయదుర్గం ‘మై హోమ్ భూజ అపార్ట్మెంట్’ లో పోసానిని  (Posani Krishna Murali)  రాయచోటి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల సాయంతో ఆంధ్ర పోలీసులు పోసానిని అరెస్ట్ చేసి.. ఆంధ్రకి తీసుకెళ్లడం జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..లను అనుచిత వ్యాఖ్యలతో దూషించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ పై కూడా పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిపై కేసులు నమోదయ్యాయి.

Posani Krishna Murali

ఇక గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా సరే పోసాని తగ్గలేదు. ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’ అంటూ మళ్ళీ రెచ్చిపోయాడు. దీంతో అతనిపై కేసులు ఇంకా స్ట్రాంగ్ అయినట్టు అయ్యింది. అయితే కొద్ది రోజుల నుండి కస్టడీలో ఉన్న పోసానికి ఇప్పుడు ఊరట లభించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరయ్యింది. కొద్దిరోజుల క్రితం అన్నమయ్య డిస్ట్రిక్ట్ కి చెందిన ఓబులవారిపల్లి పీఎస్ లో పోసానిపై నమోదైన సంగతి తెలిసిందే.

ఈ కేసులో భాగంగా కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం విశేషం.పోలీసులు పోసానిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకువెళ్లాలని వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. కానీ నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ బెయిల్ వస్తేనే కానీ పోసాని బయటకు వచ్చే అవకాశం లేదు అని సమాచారం. మరి దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పోసానికి కొంత రిలీఫ్ దొరికినట్టే అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus