టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకి అసలు టైమే బాలేదు…గత ఏడాది భారీ అంచనాలతో విడుదలయ్యి డిజాస్టర్ గా మారిన ప్రిన్స్ బ్రహ్మోత్సవం సినిమా కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి….ఈ సినిమా తరువాత వెంటనే ప్రిన్స్ తమిళ టాప్ దర్శకుడు మురుగుదాస్ తో భారీ బడ్జెట్ సినిమా ఒకటి స్టార్ట్ చేసినప్పటికీ వెంటనే మోడి బ్ల్యాక్ మనీ పై విసిరిన కొరడాతో కాస్త ఇబ్బందుల్లో పడింది…ఇదిలా ఉంటే….
మోడి పుణ్యమా అని ఈ సినిమాకి చాలా విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి….టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వివరాల ప్రకారం….ఈ సినిమా తెలుగు తమిళ హిందీ శాటిలైట్ రైట్స్ ను 23 కోట్లకు కొనుక్కోవడానికి ముందుకు వచ్చిన ‘జి’ ఛానల్ ఇప్పడు ఆ నిర్ణయాన్ని మానుకున్నట్లు సమాచారం…దానికి గల కారణాలు ఏంటి అంటే…ప్రస్తుత కరెన్సీ కష్టాల పరిస్థుతులలో ఇంత భారీ వైట్ ఎమౌంట్ కు ఈ మూవీని కొని మార్కెట్ చేయడం కష్టం అన్న అభిప్రాయంలో ‘జీ’ తెలుగు ఛానల్ మేనేజ్మెంట్ బ్యాక్ స్టెప్ వేసినట్లు సమాచారం. అది కాకుండా….గత ఏడాది…ఇదే ఛానల్ ‘బ్రహ్మోత్సవం’ మూవీని అత్యంత భారీ రేట్లకు కొని, బాగా నష్టపోయిన నేపధ్యంలో మహేష్ మురగదాస్ ల లేటెస్ట్ మూవీ గురించి వెనకడుగు వేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా హక్కులకోసం ఇప్పటివవరకు పోటీపడిన మన తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లు ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ కష్టాలతో కొంత వరకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో ఇబ్బంది ఈ సినిమాను వెంటాడుతూ….సినిమాను సమస్యల్లోకి నెట్టేస్తుంది అని తెలుస్తుంది…మరి ఈ కష్టాల నుంచి సినిమాను ఎలా గట్టెకిస్తారొ చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.