ప్రిన్స్ మహేష్ బాబు…తమిళ సెన్సేషనల్ దర్శకుడు మురుగుదాస్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘స్పైడర్’. ఈ సినిమా అటు తెలుగు ఇటు తమిళ బాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలయ్యి… మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే…అయితే తెలుగుతో పోలిస్తే ఈ సినిమా తమిళంలో మంచి హిట్ గా నిలిచింది…అయితే భారీ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అదే క్రమంలో దసరా బరిలో స్పైడర్ సత్తా ఏంటో చూపిస్తుందని అందరూ భావించారు. కానీ స్పైడర్ ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అటెంప్ట్ గానే మిగిలేలా కనబడుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 125 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ స్పైడర్ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా టీజర్, ట్రైలర్ లోనే కిక్ ఇవ్వలేదు.. అయితే అసలు సీక్రెట్ సినిమాలో ఉంటుంది అందుకే దాన్ని రివీల్ చేయలేదు అన్నారు.
తీరా సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచేస్తున్నారు. మహేష్ కెరియర్ లో బ్రహ్మోత్సవం తర్వాత ఈ సినిమా ఫ్లాప్ లిస్ట్ లో స్థానం సంపాదించే పరిస్థితులు కబడుతున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరుగగా దాదాపు 80 శాతం వరకు డిస్ట్రిబ్యూటర్స్ నష్టాల పాలవ్వక తప్పదని తెలుస్తుంది. దీనిపై నిర్మాతల మండలిలో చర్చలు కూడా మొదలు పెట్టారట. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది కాని ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ప్రభావం ప్రిన్స్ నెక్స్ట్ సినిమా భరత్ అను నేను పై పడటంతో, అసంతృప్తికి గురైన మహేష్ ఈ సినిమా షెడ్యూల్ ను కూడా పోస్ట్ పోన్ చేసి రెస్ట్ తీసుకుంటున్నడట. సినిమా హిట్ ను కమర్షియల్ కోణంలో చూస్ మహేష్ ఈ రిసల్ట్ ను చూసి ఏమంటాడో?