Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » మ‌హేష్‌బాబు వ్యాక్స్ స్టాట్చ్యు విడుద‌ల‌

మ‌హేష్‌బాబు వ్యాక్స్ స్టాట్చ్యు విడుద‌ల‌

  • March 25, 2019 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ‌హేష్‌బాబు వ్యాక్స్ స్టాట్చ్యు విడుద‌ల‌

మేడ‌మ్ టుసాడ్స్ రూపొందించిన సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ వ్యాక్స్ స్టాట్చ్యుని హైద‌రాబాద్‌లోని ఏఎంబీలో సోమ‌వారం ఉద‌యం సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మేడ‌మ్ టుస్సాడ్స్ త‌ర‌ఫున అలెక్స్ పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మాట్లాడుతూ “నా విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ లో , ఇక్క‌డి సినీ ప్రియుల మ‌ధ్య విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. గ‌తేడాది వాళ్లు నన్ను సంప్ర‌దించారు. ర‌క‌ర‌కాల క‌ళ్లను, రంగు రంగుల జుట్టును తీసుకొచ్చి నాకు పోల్చి చూశారు. అదంతా మామూలుగా చేస్తున్నార‌ని, కొల‌త‌లు తీసుకుంటున్నార‌ని అనుకున్నా. కానీ వారు విగ్ర‌హాన్ని మ‌లిచిన తీరు చాలా బావుంది. న‌న్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. ఒక‌సారి వాళ్లు ఆ ఫొటోల‌ను నాకు పంపించారు. వాటిని నా భార్య‌తోనూ, కొంత‌మంది స‌న్నిహితుల‌తోనూ పంచుకున్నాను. వాటిని చూసిన వారు నేనేదో సినిమాకు ఫొటో షూట్ చేశాన‌ని అనుకున్నారు. అంత బాగా ఉంది స్టాట్యూ. ప్రాణం పోసిన‌ట్టుగా చేసిన ఇవాన్ రీజ్‌, బెంటానా త‌దిత‌ర టీమ్‌కు ధ‌న్య‌వాదాలు. నాకు నా విగ్ర‌హాన్ని చూస్తుంటే ఆనందంగా, అద్వితీయంగా, గొప్ప‌గా, ఉత్కంఠ‌గా, ఒకింత భ‌యంగా, అన్నీ భావాలు క‌లగ‌లిసిన‌ట్టుగా ఉంది. భార‌త‌దేశానికి చెందిన ప‌లువురు సెల‌బిట్రీల బొమ్మ‌లు అక్క‌డున్నాయ‌ని నాకు తెలుసు. నా ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్లాల‌ని కూడా అనుకుంటున్నా“ అని చెప్పారు.
మేడ‌మ్ టుస్సాడ్స్ అలెక్స్ మాట్లాడుతూ “యునిక్ అకేష‌న్ ఇది. తొలిసారి మేం ఒకవ్యాక్స్ స్టాట్చ్యుని సింగ‌పూర్ కాకుండా, మ‌రోచోట విడుద‌ల చేస్తున్నాం. తొలిసారి మేం హైద‌రాబాద్‌కు వ‌చ్చాం. తెలుగు సినిమా స్టార్ స్టాట్యూని సింగ‌పూర్‌లో విడుద‌ల చేయ‌డం కూడా ఇదే తొలిసారి. మ‌హేష్‌ని ఎంతో మంది రిఫ‌ర్ చేశారు. మా టీమ్ 20 మంది ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డి ఈ స్టాట్యూని చేశారు. దాదాపు మ‌హేష్‌కి సంబంధించిన 200 మెజ‌ర్‌మెంట్స్ తీసుకున్నారు. కంటిపాప నుంచి అన్నీ కొల‌త‌లు తీసుకున్నారు. షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ఇప్పుడు మ‌హేష్‌బాబు స్టాట్యూని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది“ అని అన్నారు.
ఏవీయంగ్ కాంగ్ మాట్లాడుతూ “మ‌హేష్ స్టాట్చ్యుని చూడ‌టానికి సింగ‌పూర్‌కి వ‌స్తార‌ని భావిస్తున్నా“ అని అన్నారు.
మ‌హేష్ మైన‌పు విగ్ర‌హాన్ని చూసిన న‌మ్ర‌త స్పందిస్తూ “నాకు ఇద్ద‌రు భ‌ర్త‌ల‌ను చూసిన‌ట్టు ఉంది. రియ‌ల్ గా ఉన్న వ్య‌క్తి అందంగా ఉన్నారు. స్టాట్యూలో ఉన్న వ్య‌క్తి ఆయ‌నంత అందంగా ఉన్నారు“ అని అన్నారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన ప్ర‌శ్న‌జ‌వాబుల కార్య‌క్ర‌మం వివ‌రాలు…
* మ‌హేష్‌, ఇది వ‌ర‌కు ఎప్పుడైనా మేడ‌మ్ టుసాడ్స్ వెళ్లారా? అప‌్పుడు మీకు ఎలా అనిపించింది?
ఆరేళ్ల క్రితంలండ‌న్‌లో మ్యూజియమ్‌కి వెళ్లాను. నా పిల్ల‌లు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. అక్క‌డ ఉన్న మైన‌పు విగ్ర‌హాల‌తో ఫొటోలు తీసుకున్నారు. వాళ్ల‌ను చూసిన త‌ర్వాత ఎప్పుడో ఒక‌రోజు నా బొమ్మ ఇక్కడికి వ‌స్తుంద‌ని అనుకున్నా. ఇప్పుడు అది జ‌రిగింది. సింగ‌పూర్ మేడ‌మ్ టుస్సాడ్స్ కి ధ‌న్య‌వాదాలు. చాలా ఆనందంగా ఉంది.
* అలెక్స్… సింగ‌పూర్‌కి బ‌య‌ట తొలిసారి ఈ స్టాట్చ్యుని విడుద‌ల చేయ‌డానికి కార‌ణం ఏంటి?
– నిజ‌మే. తొలిసారి మేం ఇలా ఆవిష్క‌రిస్తున్నాం. మ‌హేష్ ఇక్క‌డ చాలా పెద్ద సూప‌ర్‌స్టార్‌. ఆయ‌న ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండాల‌ని చేశాం.
* హైద‌రాబాద్ సిటీ ఎలా ఉంది?
– హైద‌రాబాద్ చాలా బావుంది. ప్ర‌జ‌లు ఈ లాంచ్ కి స‌పోర్ట్ చేయ‌డం చాలా బావుంది.
* మీ మైన‌పు ప్ర‌తిమ‌ను చూస్తుంటే ఏమ‌నిపిస్తోంది మ‌హేష్‌?
– చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మేడ‌మ్ టుస్సాడ్స్ సింగ‌పూర్ వాళ్లు ఇంత బాగా చేశారు. మా పిల్ల‌ల ముందు విడుద‌ల చేయ‌డం చాలా బావుంది. టీమ్‌కి థాంక్యూ.
* `మ‌హ‌ర్షి` గురించి చెప్పండి?
– నా 25వ సినిమా. నా బిగ్గెస్ట్ సినిమా అవుతుంది.
* మీ బొమ్మ‌తో మీకు మాట్లాడే అవ‌కాశం వ‌స్తే ఏం మాట్లాడుతారు?
– ఎలా ఉన్నావు.. బావున్నా.. అని మాట్లాడుతా. (న‌వ్వుతూ) స్టాట్చ్యు చాలా బావుంది.
* మీ ఐ, హెయిర్ అలాగే చేశారు? ఎలా సాధ్య‌మైంది?
– మెజ‌ర్‌మెంట్స్ అని ఒక‌సారి వ‌చ్చారు. స‌రేన‌ని ఇచ్చాను. కానీ ఇంత డీటైలింగ్‌గా ఉంటుంద‌ని అనుకోలేదు. నా పాదం సైజ్‌, నా చేతుల సైజు, నా రంగు, నా చ‌ర్మం, నా గోళ్లు… ఇలా అన్నీ నాలాగే ఉన్నాయి.
* ఇక మీకు సెల్ఫీ డిమాండ్ త‌గ్గుతుందేమో?
– నాకు సెల్ఫీలు వ‌చ్చినా నా బొమ్మ‌కు సెల్ఫీలు వ‌చ్చినా సేమే క‌దా.
* ఈ బొమ్మ‌ను చేయ‌డానికి ఎన్ని రోజులు ప‌ట్టింది?
– 20 మంది 6 నెల‌లు ప‌నిచేశారు. చాలా కేర్ తీసుకుని చేశారు.
* ఇలాంటివ‌న్నీ సింగ‌పూర్‌లో పెడ‌తారు. మ‌రి హైద‌రాబాద్‌లో ఎందుకు పెట్టారు?
– నా షెడ్యూల్స్ టైట్ వ‌ల్ల అక్క‌డికి వెళ్ల‌డానికి కుద‌ర‌లేదు. అందుకే వాళ్లు ఇక్క‌డికి వ‌చ్చారు. అది హాన‌ర్‌. నా పిల్ల‌ల ముందు దీన్ని విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది.
* మీ సినిమాల్లో ఈ స్టాట్యూని చూడొచ్చా?
– సింగ‌పూర్ మ్యూజియ‌మ్‌కి వెళ్లి చూడొచ్చు. సినిమాల్లో కాదు.
* మ‌హేష్ స్టాట్యూని చేయ‌డానికి కార‌ణం ప్ర‌త్యేకంగా ఏదైనా?
– ప్ర‌పంచంలోని ప‌లువురు చేసిన రిక్వెస్ట్ కార‌ణంగా మేం ఇది చేశాం.
* మీ స్టాట్యూ పెడుతున్నార‌ని తెలియ‌గానే.. ఇంట్లో వాళ్లు ఏమ‌న్నారు?
– మా ఆవిడ ఈ విష‌యాన్ని నాతో చెప్పింది. చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. నాకు ఏదో అచీవ్ చేసిన‌ట్టు అనిపించింది.
* మైన‌పు విగ్ర‌హం చూడ‌గానే ఇద్ద‌రు భ‌ర్త‌లున్నార‌ని న‌మ్ర‌త అన్నారు.
– ఇద్ద‌రు మ‌హేష్‌బాబులున్నార‌ని ఆవిడ మాట‌కు అర్తం అండీ.
* మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?
* చాలా చాలా గౌర‌వంగా, థ్రిల్‌గా, ఆనందంగా ఉంది.
* ఈస్టాట్యూని చేయ‌డానికి మీరేమైనా స‌జెష‌న్స్ ఇచ్చారా?
– అలాంటిదేమీ లేదు.
* ఈ లుక్ ఏ సినిమాలోది?
– ఈ లుక్ శ్రీమంతుడులో లుక్‌. శ్రీమంతుడు లో ఆ పోజు బావుంద‌ని చెప్పి, అలా పోజు ఇవ్వ‌మ‌ని అడిగారు. అలాగే ఇచ్చాను. నా అన్నీ ఫొటోలు చూశారు. ఏది బావుంటే, దాన్ని బ‌ట్టి తీసుకున్నారు.
* భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత హాలిడే వెళ్లారు. మ‌హ‌ర్షి త‌ర్వాత ఏంటి?
– ఇంకా పెద్ద హాలిడేకి వెళ్తాం. ఎందుకంటే ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Mahesh Babu
  • #mahesh babu family
  • #Mahesh Babu Latest Meet
  • #Mahesh Babu wax figure

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version