దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన బాహుబలి టాలీవుడ్ రికార్డులన్నింటినీ తన అకౌంట్ లో వేసుకుంది. వాటిని బద్దలు కొట్టేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సిద్ధమైంది. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ప్రిన్స్ చేస్తున్న సినిమా రిలీజ్ కి ముందే సంచలనాలకు తెర తీస్తోంది. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ సెట్స్ పై ఉండగానే తెలుగు శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయాయి.
అనేక ఛానళ్ల వారితో పోటీపడి జీ గ్రూప్ వారు అత్యధిక రేటుకి సొంతం చేసుకున్నారు. తెలుగు, హిందీ(డబ్బింగ్) శాటిలైట్ హక్కుల కోసం ఈ సంస్థ 26.5 కోట్లు చెల్లించింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా ఇంత ధర పలకలేదు. ఈ రికార్డును మహేష్ బాబు మూవీ సాధించింది. బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ రెండు చిత్రాలకు కలిపి తెలుగు శాటిలైట్ హక్కులను మాటీవీ 25 కోట్లకు కొనుగోలు చేసింది. మహేష్ ఒక్క చిత్రమే ఆ రికార్డ్ ను బద్దలు కొట్టింది. అందుకే అంటారు ప్రిన్స్ ని సూపర్ స్టార్ అని.