టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” అనుకున్నంత సక్సెస్ కాకపోయినా ప్రిన్స్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే అదే క్రమంలో ప్రిన్స్ తన తరువాత చిత్రం ప్రముఖ తమిళ దర్శకుడు మురుగుదాస్ తో చేస్తున్న విషయం తెలిసిందే… ఇక ఈ సినిమా తోలి షెడ్యూల్ సైతం పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ ప్లానింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాయే బిజినెస్ గురించి సినిమా సర్కిల్స్ లో ప్రధాన చర్చ మొదలయింది.
ఇంతకీ ఏంటి ఆ చర్చ… అంటే సినిమాకి హిందీలో వస్తున్నా డిమాండ్ గురించి. సహజంగా ప్రిన్స్ ఉన్నాడు కాబట్టి తెలుగులో, ఇక దర్శకుడు తమిళ్ లో సూపర్ డైరెక్టర్ కాబట్టి తమిళ్ లో ఎలా అయినా ఈ సినిమాకి భారీ రేట్ వస్తుంది… కానీ హిందీలో ఒక బడా సంస్థనే సినిమాని భారీగానే కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండడం.చూస్తుంటే ప్రిన్స్ రేంజ్ ఏంటో యిట్టె అర్ధం అర్ధం అయిపోతుంది… సూపర్ స్టార్ నా మజాకా.