నృత్య శిక్షణ మొదలెట్టిన మహేష్ బాబు కూతురు సితార
- August 22, 2017 / 07:56 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత తమ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులకు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా తమ కూతురు సితార గురించి ఎక్కువగా విషయాలను పంచుకుంటుంటారు. సెలవుల్లో చాకోలెట్ తయారీ నేర్చుకోవడం దగ్గర నుంచి మొన్న గౌతమ్ కి సితార రాఖీ కట్టడం వరకు ఫొటోలతో సహా షేర్ చేశారు. తాజాగా సితార నటరాజ స్వామికి పూజ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసి మంచి వార్తను చెప్పింది. సితార తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ క్లాసులకు వెళ్తోందని చెప్పారు.
హైదరాబాద్‌లోని “నాట్య వేద” అకాడమీలో సితార సాంప్రదాయ నృత్యాన్ని నేర్చుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి నుంచే నమ్రత తమ కూతురికి డ్యాన్స్ లో శిక్షణ ఇస్తుందంటే తనలాగే ఆమెను స్టార్ చేసే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. గౌతమ్ ఇప్పటికే ఒన్ నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. సితార కూడా త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















