మహేష్ అభిమానులను ఇబ్బంది పెడుతున్న ఫేక్ వార్తలు
- March 27, 2017 / 10:10 AM ISTByFilmy Focus
తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం వియత్నాం’ లో షూటింగ్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్నఈ సినిమా గురించి వస్తున్న వార్తలు ప్రిన్స్ ఫ్యాన్స్ ని నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీ సెట్స్ పై వెళ్లినప్పటి నుంచి అనేక ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా టైటిల్ పై అనేక వార్తలు వచ్చాయి. మహేష్ మూవీ టైటిల్ ఇదే నంటూ.. అరడజనుకు పైగా పేర్లు బయటికి వచ్చాయి. తాజాగా మహేష్ సినిమాలోది అంటూ “ఏమాయలో” అనే పాట వీర విహారం చేసింది.
దీంతో ఫ్యాన్స్ గుండె ఆగిపోయినంత పని అయింది. అనంతరం ఆ పాట ప్రయివేట్ ఆల్బంలోనిది అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలకు చిత్ర బృందం అడ్డుకునే చర్యలు చేపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















