Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Advertisement

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు విదేశీ పర్యటనల గురించి ఓ డిస్కషన్‌ టాలీవుడ్‌లో, తెలుగు సినిమా ఫ్యాన్స్‌లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దానికి కారణం ఆయనకు షూటింగ్స్‌లో చిన్న గ్యాప్‌ దొరికితే చాలు విదేశాలకు టూర్‌కి వెళ్లిపోతారు. అంతలా టూర్స్‌ అంటే ఆయనకు సరదా. ఆ సమయంలో సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటారు అని చెబుతారు. అయితే ఇప్పుడు మహేష్‌బాబు వెళ్లి జర్మనీ టూర్‌ పర్సనల్‌ టూర్‌ కాదు అని సమాచారం. ఎందుకంటే ఇదంతా జక్కన్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్లానింగ్‌ ప్రకారం జరిగింది అని చెబుతున్నారు.

Mahesh Babu

అవును, మీరు చదివింది నిజమే. మహేష్‌ బాబు ప్రజెంట్‌ టూర్‌ పర్సనల్‌ కాదట. ‘వారణాసి’ సినిమా కోసం వెళ్లారట. రాజమౌళి – మహేశ్‌ బాబు – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా అప్‌డేట్స్‌ ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్‌ మేజర్‌ పార్ట్‌ అంతా అయిపోయింది అనే సమాచారం బయటకు రావడంతో ఆ ఎదురుచూపులు ఇంకా పెరిగాయి.

ఈ సమయంలో మహేశ్‌ ఇటీవల జర్మనీ వెళ్లడంతో పర్సనల్‌ టూర్‌ అని అందరూ భావించారు. ఇప్పట్లో ‘వారణాసి’ అప్‌డేట్‌ రాదు అనుకున్నారు. కానీ అనుకోకుండా ఓ అప్‌డేట్‌ వచ్చేసింది. అయితే ఇది చిత్రబృందం ఇచ్చింది. ఆ కొత్త అప్‌డేట్ ప్రకారం మహేష్‌ సినిమా కోసం ట్రైనింగ్‌లో భాగంగానే జర్మనీ వెళ్లినట్లు మహేశ్‌ షేర్‌ చేసిన ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం మహేశ్‌ జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో ఉన్నాడు.

అక్కడ ఫిట్‌నెస్, వెల్‌నెస్ నిపుణుడు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నాడట. దీనికి సంబంధించిన ఫొటోలను మహేశ్‌ బాబు తన సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ట్రెక్కింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ ‘వారణాసి’ సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు క్యాప్షన్‌ పెట్టాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus