ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌ను ‘రాకా’గా చూపించడానికి దర్శకుడు అట్లీ చాలా రోజులుగా పని చేస్తూనే ఉన్నారు. ‘రాకా’గా బన్నీ ఎలా ఉంటాడో ఓ ప్రీ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, అసలు ఎవరెవరు హీరోయిన్లుగా నటిస్తున్నారు అనే విషయం మాత్రం చెప్పడం లేదు. అసలు సినిమా నుండి ఎలాంటి సమాచారం రావడం లేదు అని గత కొన్ని రోజులుగా ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో హీరోయిన్‌ల పాత్ర చిత్రణలు ఇలా ఉండొచ్చు అంటూ మరో సమాచారం బయటకు పంపించారు.
పై చెప్పినట్లు అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ అధికారికంగా బయట వచ్చింది కొన్ని విషయాలే. హీరోగా బన్నీ, ఒక హీరోయిన్‌గా దీపిక పడుకొణె నటిస్తున్నారు అని మాత్రమే చెప్పారు. సంగీతం దర్శకుడు సాయి అభ్యంకర్ అని చెప్పారనుకోండి. ఇక లీక్‌ల ప్రకారం సినిమాలో నటిస్తున్నారు అని చెబుతున్న హీరోయిన్ల గురించి చూస్తే.. జాన్వీ కపూర్ ఈ సినిమాలో గిరిజన యువతిగా కనిపిస్తుందట. గత రెండు తెలుగు సినిమాల పాత్రలకు దగ్గరగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఆమె పాత్ర ఉంటుందన్నమాట. ఇక రష్మిక మందన పాత్రను దీపికా పడుకొణె పాత్రకు ఒక విధంగా గురువుగా చూపించబోతున్నారట.
మృణాల్ ఠాకూర్ పాత్ర హీరోయిన్ కాదని, ఓ ముఖ్యమైన పాత్ర అని చెబుతున్నారు. ఇవన్నీ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు చెబుతారట. వీరంతా కాకుండా యంగ్ హీరోయిన్లు మరో ఇద్దరు ఉన్నారు అని మరో టాక్ కూడా ఉంది. వారి గురించి ఇంకా వివరాలు బయటకు రాలేదు. ఇక ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరో నటిస్తాడు అని చెప్పారు. ఆ విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్నీ తేలాలంటే సినిమా పూర్తవ్వాలి. అప్పుడు టీమ్ డేట్ అనౌన్స్ చేయాలి. ప్రచారం షురూ చేయాలి. అప్పుడు కానీ అసలు విషయం బయటకు రాదు.