vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

నవంబర్‌, డిసెంబర్‌లో పెద్ద సినిమాల రిలీజ్‌ అంటే ఒకప్పుడు టాలీవుడ్‌ పెద్ద ఆశ్చర్యం. ముఖ్యంగా డిసెంబరులో రిలీజ్‌ డేట్ అని చెబితే ‘అవునా’ అనేవారు. ఎందుకంటే అదొక పెద్ద అన్‌ సీజన్‌ అని అనుకునేవారు కాబట్టి. అయితే ఈ పరిస్థితి మొత్తాన్ని మార్చేసిన హీరో అక్కినేని నాగార్జున. సంక్రాంతికి వచ్చేదేంటి.. ముందే వచ్చి సంక్రాంతి వరకు ఉంటా అని చెప్పేవారు. అలా డిసెంబరు మూడో వారంలో సినిమాను రిలీజ్‌ చేసి, సంక్రాంతి వరకు థియేటర్లలో ఉండేవారాయన. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆ సీజన్‌ని ఆయన కొడుకు వాడుకోబోతున్నాడు అని సమాచారం.

vrushakarma

నాగచైతన్య హీరోగా కార్తీక్‌ దండు తెరకెక్కిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. నిజానికి ఈ పాటికి సినిమా షూటింగ్‌ అయిపోయి, విడుదలకు సిద్ధం అవ్వాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ఇప్పుడు ఫైనల్‌గా సినిమాకు రిలీజ్‌ డేట్ ఇవ్వాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. ఈ మేరకు ఓ టీజర్‌ వీడియోను రెడీ చేస్తున్నారు అని తెలిసింది. అందులో డిసెంబరు డేట్‌నే అనౌన్స్‌ చేస్తారటట.

పురాణాంశాలతో మిళితమైన ఈ మిస్టిక్‌ హారర్‌ థ్రిల్లర్‌లో చైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనున్నారు. గతంలో ఈ మేరకు చైతునే చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ సినిమా ఏమవుతోంది అనే ప్రశ్న ఉండింది. అయితే ఈ రిలీజ్‌ డేట్‌ లీక్‌తో సినిమా ముచ్చట్లు బయటకు వచ్చాయి. కాస్త థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ ఉన్న ఈ కథతో చైతు వరుసగా రెండో హిట్‌ కొట్టే ఆలోచనలో ఉన్నాడు. గత సినిమా ‘తండేల్’ బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితమే అందుకుంది.

ఈ సినిమా తర్వాత చైతు ‘దూత 2’ వెబ్‌సిరీస్‌ పనుల్లో బిజీ అవ్వబోతున్నాడు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘దూత’ వెబ్‌ సిరీస్‌కు మంచి స్పందనే వచ్చింది. దీంతో రెండో సిరీస్‌ మీద భారీ అంచనాలే ఉన్నాయి.

సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus