హైదరాబాద్ లో మొదలైన మహేష్, మురుగదాస్ మూవీ షూటింగ్
- January 10, 2017 / 07:35 AM ISTByFilmy Focus
గుజరాత్ ముఖ్య పట్టణం అహ్మదాబాద్ లో డిసెంబర్ 24 వరకు భారీ షెడ్యూల్ ని పూర్తి చేసిన డైరక్టర్ మురుగదాస్ షూటింగ్ కి పది రోజులు బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ షెడ్యూల్ ని ఈ రోజు నుంచి ప్రారంభించారు. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో వేసిన హైదరాబాద్ రోడ్ సెట్ లో మంగళవారం చిత్రీకరణ పునః ప్రారంభించారు. భార్య, పిల్లలతో కలిసి స్విట్జర్ ల్యాండ్ టూరుకు వెళ్లి రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. అతనితో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారు. వీరిద్దరి పై కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ జనవరి నెల మొత్తం కొనసాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఇక్కడ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం పూణే కి పయనం కానుంది.
ఫిబ్రవరి నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని, ఆ తర్వాత మిగిలిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్తామని నిర్మాత ఠాగూర్ మధు చెప్పారు. వంద కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి “సంభవామి” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ జనవరి 26 న విడుదల చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















