మహేష్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ జనవరి 7 న ప్రారంభం
- December 29, 2016 / 07:47 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ భారీ షెడ్యూల్ గుజరాత్ ముఖ్య పట్టణం అహ్మదాబాద్ లో 24 న పూర్తి విజయవంతంగా పూర్తి చేసుకుంది. దాదాపు 20 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో మహేష్ ,హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో డైరక్టర్ పదిరోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. అందరూ రిలాక్స్ అవుతుంటే ప్రిన్స్ మాత్రం భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార, బావ గల్లా జయదేవ్ కుటుంబంతో కలిసి స్విట్జర్ ల్యాండ్ టూరుకు వెళ్లారు. అక్కడే జురిచ్ లో క్రిస్టమస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. కొత్త సంవత్సరాన్ని కూడా అక్కడే జరుపుకొని జనవరి మొదటి వారంలో ఇండియా రానున్నారు. వచ్చిన వెంటనే షూటింగ్ లో పాల్గొంటారు.
ఈ విషయంపై నిర్మాత ఠాగూర్ మధు మాట్లాడుతూ “మహేష్ జనవరి ఫస్ట్ వీక్ తిరిగొస్తారు. జనవరి 7 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. కొన్ని సీన్స్ కోసం ముంబై, పూణేలకు కూడా వెళ్ళనున్నాం. ఫిబ్రవరి నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుంది. ఆ తర్వాత మిగిలిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్తాము” అని వివరించారు. వంద కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి “సంభవామి” అనే టైటిల్ అనుకుంటున్నారు. ఫస్ట్ లుక్ ని జనవరి 26 న విడుదల చేసేందుకు డైరక్టర్ ప్లాన్ చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















