సూపర్ స్టార్ ని ఆశ్చర్యానికి గురి చేసిన నవీన్ కృష్ణ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు మరో హీరో షాకిచ్చారు. ఆ షాక్ తిన్న ప్రిన్స్ కి కోపం రాలేదు. ఆనంద పడ్డారు. ఇంతకీ అంతలా ఆశ్చర్యానికి గురి చేసిన హీరో ఎవరో తెలుసా.. నవీన్ కృష్ణ.  ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మనవడు ఈయన. అలనాటి హీరో నరేష్ తనయుడు. ఈ యువ హీరో “నందిని నర్సింగ్ హోం” ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. గతంలో నవీన్ కృష్ణ అనేక చిత్రాలకు ఎడిటర్ గా పని చేశారు.

అప్పుడు 130 కిలోల బరువుతో లావుగా ఉండేవారు. ఆ సమయంలో తనకి హీరో కావాలని ఉందని సూపర్ స్టార్ మహేష్ కు చెప్పగా, అందుకు ఆయన బరువు తగ్గాలని సలహా ఇచ్చారంట. ప్రిన్స్ సలహా మేరకు రెండేళ్లు కష్టపడి 55 కిలోలు బరువు తగ్గారు. స్లిమ్ గా తయారై మహేష్ కి కనిపించడంతో ఆయన షాక్ కి గురి అయ్యారని నవీన్ కృష్ణ వెల్లడించారు. పీవీ గిరి దర్శకత్వంలో నవీన్ నటించిన నందిని నర్సింగ్ హోం చిత్రం ఈనెల 21న రిలీజ్ కానుంది.

https://www.youtube.com/watch?v=K3sV5NoIqks

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus