ప్రభాస్‌ సినిమా తర్వాత పవన్‌ సినిమా పక్కానా? హీరోయిన్‌ క్లారిటీ!

  • March 22, 2023 / 12:09 AM IST

పవన్‌ కల్యాణ్‌ కొత్త హీరోయిన్‌ ఎవరు? గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుంది అనే రూమర్‌ బయటకు వచ్చినప్పటి నుండి ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం ఉంది కాబట్టి. సినిమా ప్రారంభానికి ముందు హీరోయిన్‌ ఎందుకు తప్పుకుంది అనే విషయం పక్కనపెడితే ఆమె ప్లేస్‌లో ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఆ నాయిక మాళవిక మోహనన్‌ అనేది టాక్‌.

‘భవదీయుడు భగత్‌ సింగ్‌’గా మొదలై ఆ తర్వాత ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’గా మారిపోయింది హరీశ్‌ శంకర్‌ సినిమా. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘తెరి’ సినిమాను తెలుగులో నేపథ్యం, తదితర అంశాలు మార్చి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ తీస్తున్నారని టాక్‌. ఈ సినిమాలో హీరోయిన్‌ పూజా హెగ్డే నటించాలి. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో మాళవిక మోహనన్‌ నటిస్తుందని వార్తలొచ్చాయి. ప్రభాస్‌ – మారుతి సినిమాలో నటిస్తున్న మాళవిక ఆ తర్వాత ఈ సినిమాలోనే చేస్తుందని కూడా చెప్పారు. అయితే ఈ విషయంలో మాళవిక స్పందించింది.

“పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో అభిమానం. అయితే పుకార్లు వస్తున్నట్లు నేను ఆ ప్రాజెక్ట్‌లో పని చేయడం లేదు. కానీ వేరే తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను” అని చెప్పింది మాళవిక. దీంతో మాళవిక ఆ సినిమాలో నటించడం లేదు అనే విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే ఎవరు నటిస్తారు అనే విషయంలో స్పష్టత రావడం లేదు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వాలి. హీరోయిన్‌ అప్పటికి కుదరకపోతే వేరే సీన్స్‌ తీస్తారు అని చెబుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్‌ షూటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ సినిమాల షూటింగ్‌లు చేస్తాడని అంటున్నారు. ఇందులో ఒకటి పూర్తయితే ‘ఓజీ’ (సుజిత్‌ సినిమా) స్టార్ట్‌ చేస్తారని టాక్‌. అయితే తాను కూడా లైన్‌లో ఉన్నానని ఇటీవల సుధీర్‌ వర్మ చెప్పారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus