విజయ్‌ – గౌతమ్‌ కాంబినేషన్‌ ఓసారి మిస్ అయ్యాం.. ఏ సినిమానో తెలుసా?

విజయ్‌ దేవరకొండ – గౌతమ్‌ తిన్ననూరి.. ఈ కాంబినేషన్‌ మీద ఇప్పుడు బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి కారణం ఆ ఇద్దరూ కలసి చేసిన ‘కింగ్డమ్‌’ అనే సినిమా వస్తుండటమే. ఈ నెల 31న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్‌ని మన ఎనిమిదేళ్ల క్రితమే మిస్‌ అయ్యాం అని తెలుసా? అవును మీరు చదివింది నిజమే. విజయ్‌ – గౌతమ్‌ గతంలో ఓ సినిమా కోసం ప్లాన్‌ చేశారు. అయితే వివిధ కారణాల వల్ల అప్పుడు సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ కాంబినేషన్‌ సెట్‌ అయింది.

Malli Raava

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన తొలి సినిమా ‘పెళ్ళి చూపులు’ విడుదల కాకముందు గౌతమ్‌ ఓ కథ చెప్పారట. కొద్ది రోజులు ఆ సినిమా గురించి చర్చలు జరిగాక.. వర్కవుట్‌ కాక ఆ ఆలోచన ఆపేశారట. ఆ సినిమానే సుమంత్‌ హీరోగా తెరకెక్కిన ‘మళ్ళీ రావా’. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గౌతమ్‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్పుడు మిస్‌ అయిన తమ కాంబో ఇప్పుడు సెట్‌ అయింది అని చెప్పారు. సుమంత్‌ కెరీర్‌లో బెస్ట్‌ అనిపించుకున్న కొన్ని సినిమాల్లో ‘మళ్ళీ రావా’ ఒకటి.

అప్పుడు ఆ సినిమాను విజయ్‌ చేసి ఉంటే.. ఇప్పుడు కచ్చితంగా మంచి ఇమేజే సంపాదించుకునేవాడు. అయితే అది ఇప్పుడు విజయ్‌కి ఉన్న ఇమేజ్‌ కాదు. ఈ సమయంలోనే ఓ మాట అనిపిస్తుంది. ఎవరికి దక్కాల్సిన సినిమా వాళ్లకు దక్కుతుంది అని. ఇక ‘కింగ్డమ్‌’ సినిమా విషయానికొస్తే.. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా షూటింగ్‌ గురించి విజయ్‌ మాట్లాడుతూ షూటింగ్‌ మొదలు పెట్టిన కొత్తలో ఏ సీన్‌ తీసినా, ఇది వర్కవుట్‌ అవుతుందా? లేదా? అని కాస్త భయం ఉండేదట. 60 శాతం షూటింగ్‌ చేసిన తర్వాత ‘హమ్మయ్య’ అనుకున్నాడట విజయ్‌..

వరుస ప్లాపులు.. ఆప్షన్ లేక టాప్ హీరోతో సన్నిహితంగా.. హీరోయిన్ భాగోతం ఇది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus