Mallika Sherawat: ”ఇప్పటికీ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి”: మల్లికా శెరావత్

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది తారలు మీడియా ముందుకొచ్చి చెప్పారు. మీటూ అంటూ ఓ ఉద్యమం కూడా మొదలుపెట్టారు. ఈ ఉద్యమం ఎంత పెద్ద వివాదం రేపిందో తెలిసిందే. అయితే మీడియా పెద్దగా లేని రోజుల్లో తాను ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్. ‘మర్డర్’ సినిమాతో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిన మల్లికాకు ఆ తరువాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

అయితే అంతకుమించి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. తన కెరీర్ మొదలైన రోజుల్లో ఇప్పుడున్నంత మీడియా లేదని.. హీరోయిన్ గా రాణించాలంటే హీరోతో గడపడం తప్పనిసరి అనే పరిస్థితులు ఉండేవని చెప్పుకొచ్చింది. హీరోలతో గడపడానికి అంగీకరించలేదని.. చాలా సినిమాల్లో తనను తొలగించారని తెలిపింది. సినిమాలో అవసరం లేకపోయినా.. బోల్డ్ సీన్లు కావాలనేవారని గుర్తుచేసుకున్నారు. షార్ట్ స్కర్ట్స్ వేసుకొని ముద్దు సీన్ లో నటిస్తే చెడుగా ప్రచారం చేశారని..

ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి రియల్ లైఫ్ లో ఎందుకు కుదరదంటున్నావని.. అడిగిన హీరోలు కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయని.. వాటికి దూరంగా లాస్ ఏంజెల్స్ లో చాలా ప్రశాంతంగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది మల్లికా శెరావత్.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus