Mama Mascheendra First Review: ‘మామా మశ్చీంద్ర ఫస్ట్ రివ్యూ’ వచ్చేసింది.. ఎలా ఉందంటే

  • October 6, 2023 / 10:41 AM IST

సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ మూవీ మామా మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ తో పాజిటివ్ బజ్‌ ని క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి.

సినిమా చూసిన వారు తమ టాక్ ను తెలియజేస్తూ వస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. ఇంటర్వల్ వద్ద వచ్చే ట్విస్ట్ థ్రిల్ కి గురి చేస్తుందట. కొన్ని చోట్ల కామిడీ కూడా బాగుందట. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యింది అని తెలుస్తుంది. అయితే తర్వాత బోర్ కొట్టింది అని అంతా చెబుతున్నారు. క్లైమాక్స్ పర్వాలేదు అని తెలుస్తుంది. మొత్తంగా సినిమా బాగుంది అని కొంతమంది, పర్వాలేదు అని కొంతమంది చెబుతున్నారు.

మొత్తంగా మామా మశ్చీంద్ర చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే రాబట్టుకుంది అని తెలుస్తుంది. కానీ బాక్సాఫీసు వద్ద ఎంతలా రాణిస్తుంది అనేది చూడాలి. ప్రమోషన్స్ అయితే అంతగా జరగలేదు. సుదీర్ బాబు గత సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. మరి ఈ సినిమా ఎంతవరకు రాణిస్తుంది అనేది చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus