Manchu Lakshmi: మంచు లక్ష్మీ కూతురుకి యాక్సిడెంట్.. తీవ్రంగా గాయాలు!

మంచు లక్ష్మీ(Manchu Lakshmi) కూతురుకి యాక్సిడెంట్ అయ్యిందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఈ విషయం పై మంచు లక్ష్మీ కూడా క్లారిటీ ఇచ్చింది. మార్చ్ 19 న అంటే మోహన్ బాబు పుట్టినరోజు నాడు ఈ ప్రమాదం జరిగినట్టు ఆమె తెలిపింది. ఆరోజు పిల్లలందరితో కలిసి భగి తోలుతుంటే.. అదుపుతప్పి చెట్టును గుద్దుకుందట. ఈ క్రమంలో మంచు లక్ష్మీ పక్కన పడిపోయిందట. పిల్లలందరూ ఆమె పడిపోయింది కదా అని..

గట్టిగా అరిచి ఆమె వద్దకు వెళ్లారట.. కానీ మంచు లక్ష్మీ కూతుర్ని ఎవ్వరూ చూడలేదట. తీరా వెళ్లి చూస్తే యాపిల్ ( మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ) మొహం నిండా రక్తమట. పాపని ‘ భగి ఎక్కించుకాకుండా అవాయిడ్ చేసుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల తనకు కుట్లు పడ్డాయి.. ‘ అంటూ మంచు లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. మొన్నటికి మొన్న అంటే ఈ యాక్సిడెంట్ జరగడానికి ముందు..

మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి తెలుసా తెలుసా .. అంటూ సాగే తన సినిమాలోని పాటకు చిందేసింది. ఆ పాటలో విద్యా నిర్వాణ లుక్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. మంచు లక్ష్మీ ప్రధాన పాత్ర పోషించి నిర్మించిన అగ్ని నక్షత్రం అనే సినిమాలోని పాట అది. మోహన్ బాబు కూడా ఆ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus