ఉత్తమ ప్రతినాయకిగా నంది అవార్డ్ గెలుచుకున్న టాలెంట్ ఉన్నప్పటికీ.. మంచు లక్ష్మికి ఇప్పటివరకూ నటిగా కానీ.. నిర్మాతగా కానీ ఒక్కటంటే ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా లేకపోవడంతోపాటుగా ఇక్కడ పెద్దగా ఆఫర్లు కూడా లేకపోవడంతో చివరాఖరికి తమిళ సీమకు వెళ్ళిపోయి అక్కడ జ్యోతిక హీరోయిన్ గా రూపొందుతున్న “తుమారీ సులూ” రీమేక్ లో నేహా ధూపియా పోషించిన పాత్రను పోషిస్తూ అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తోంది.
నిజానికి.. మంచు లక్ష్మి నటించి-నిర్మించిన “వైఫ్ ఆఫ్ రామ్” కాస్త మంచి టాక్ వచ్చినా, కలెక్షన్స్ మాత్రం రాలేదు. దాంతో భారీ స్థాయిలో నష్టపోయింది మంచు లక్ష్మి. అయితే.. ఆ సినిమా డిజిటల్ రైట్స్ లక్కీగా నెట్ ఫ్లిక్స్ కొనడంతో మంచు లక్ష్మి ఆల్మోస్ట్ లాస్ నుంచి సేవ్ అయిపోయిందట. ఈ విషయాన్ని ఆమె పి.ఆర్ టీం మీడియాతో షేర్ చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ కి కూడా లక్ష్మి రెడీ చెప్పడంతో.. ఇప్పుడు మళ్ళీ ఆమె సక్సెస్ బాట పట్టే అవకాశం ఉంది.