చిరంజీవి కెరీర్ లో మచ్చుతునక లాంటి సినిమా “వేట”. రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం అనే చెప్పాలి. ఉన్నట్లుంది ‘వేట’ గురించి చెబుతున్నాడేంటి అనుకొంటున్నారా. దానికి కారణం ఉందండోయ్.. అదేంటంటే “లక్ష్మీ బాంబ్” తర్వాత మంచు లక్ష్మి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. మధ్యలో “ఫిదా” అనే షోను ప్రొడ్యూస్ చేసిన మంచు లక్ష్మీ ఆ షో పెద్దగా హిట్ అవ్వకపోవడంతో.. తానే స్వయంగా రంగంలోకి దిగి “మహారాణి” అనే మరో ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసింది.
అయితే.. బుల్లితెరపై కనిపించడం ఎంత ముఖ్యమో వెండితెరపై తన ఉనికిని చాటుకోవడం కూడా అంతే ముఖ్యమని భావించిన లక్ష్మీ ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథను మెచ్చి తన స్వంత బ్యానర్ లో సదరు చిత్రాన్ని నిర్మించడానికి నిర్ణయం కూడా తీసుకొంది. విజయ్ యాలకంటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం “వేట” అనే టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించేసింది మంచు లక్ష్మి. అతీత్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రం న్యూ జనరేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ మరియు ఆర్టిస్ట్స్ సెలక్షన్ జరుగుతోంది.