ఎన్నడూ లేని విధంగా చీరలో అందాలు వడ్డించిన మంచు లక్ష్మీ… వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 20, 2022 / 06:18 PM IST

మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో స్టార్ గా చలామణి అవుతున్న వారిలో ఈమె కూడా ఒకరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా కెరీర్ ను ప్రారంభించిన మంచు లక్ష్మీ మొదట్లో టాక్ షోలు వంటివి చేసేది. మరోపక్క తమ సొంత బ్యానర్లో సినిమాలు నిర్మించేది. ఈమె హోస్ట్ చేసిన ‘మేము సైతం’ వంటి షోలు సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా.. ఈమెకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉండగా..

మంచు లక్ష్మీ కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది అన్న సంగతి ఎక్కువమందికి తెలిసుండదు. ‘లాస్ వేగాస్’ ‘బాస్టన్ లీగల్’ ‘మిస్టరీ ఈ ఆర్’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. ఇక తెలుగు సినిమాల్లో కూడా విలన్ గా ‘అనగనగా ఓ ధీరుడు’ ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ ‘మాన్ స్టర్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది కానీ ఎక్కువ సినిమాల్లో నటించడానికి ఈమె సిద్ధంగా లేదు. కేవలం విలక్షణమైన పాత్రలకే ఈమె ఓకే చెబుతుంది.

ఇటీవల ఈమె నటించిన ‘మాన్ స్టర్’ సినిమాలో కూడా ఈమె పోషించింది లెస్బియన్ రోల్. ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని ఆ పాత్రను పోషించింది లక్ష్మీ. ఇక సోషల్ మీడియాలో నిత్యం తన కొత్త ఫోటోలను, కూతురు ఫోటోలను షేర్ చేసే మంచు లక్ష్మీ.. ఎన్నడూ లేని విధంగా చీరలో గ్లామర్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోల్లో మునుపెన్నడూ లేనంత అందంగా కనిపిస్తుంది మంచు లక్ష్మీ . ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus