Manchu Lakshmi: మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్.. మంచు లక్ష్మీ ఏమందంటే..!

  • May 25, 2024 / 12:49 PM IST

మంచు ఫ్యామిలీ నిత్యం ట్రోలింగ్లో నిలుస్తూనే ఉంటుంది. మోహన్ బాబు (M0han Babu) , లక్ష్మీ మంచు (Manchu Lakshmi) , విష్ణు (Manchu Vishnu) ..లు ఏ కార్యక్రమానికి హాజరైనా వాళ్ళ స్పీచ్ ఊహించని విధంగా ఉంటుంది. ట్రోలింగ్ బ్యాచ్ అంతా కూడా కోడి గుడ్డుపై ఈకలు వెతికినట్టు.. వీళ్ళ స్పీచ్ లు చూస్తుంటారు. వీడియోలు కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. మోహన్ బాబు చిరంజీవి (Chiranjeevi) పై విమర్శలు గుప్పించిన సందర్భాలు అనేకం. మంచు విష్ణు సైతం ‘మా’ ఎన్నికల టైంలో ఇచ్చిన స్పీచ్..లు విపరీతంగా ట్రోల్ అయ్యాయి.

మంచు లక్ష్మీ పై కూడా ట్రోలింగ్ జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆమె ఇంగ్లీష్ మాట్లాడే తీరును వక్రీకరిస్తూ చాలా మంది విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ మంచు పర్సనల్ గా ఎవ్వరినీ టార్గెట్ చేసి మాట్లాడదు. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఇక తాజాగా ఈమె తన ఫ్యామిలీ పై జరిగే ట్రోలింగ్ పై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “మాకు రాజకీయాలు తెలీదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం.

అందుకే మమ్మల్ని ట్రోల్ చేస్తారు. మేము మాట్లాడేది కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. కానీ తప్పదు. రెండిటినీ తీసుకోవాలి. మమ్మల్ని వాంటెడ్ గా ట్రోల్ చేస్తున్నారు అని నేను అనుకోను. నాకు చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) .. ఇలా ఇండస్ట్రీలో అందరు హీరోలు ఫ్రెండ్సే..! వాళ్ళ ఫాదర్స్, మా ఫాదర్స్ కలిసి పెరిగిన వాళ్లు. సో నాకు నా ఇంట్లో బాగానే ఉన్నట్టే. ఐ యామ్ హ్యాపీ” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus