Manchu Manoj: ప్రముఖ రాజకీయ నాయకుడితో భేటీ కానున్న మనోజ్ మౌనిక దంపతులు?

మంచు మనోజ్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే ఈయన ఈ ఏడాది భూమా మౌనికను రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. భూమా కుటుంబానికి ఎంతో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగగా భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే భూమా మౌనిక కూడా రాజకీయాలలోకి రాబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే మంచు మనోజ్ నా వివాహం చేసుకున్న తర్వాత ఈమె తన భర్తతో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంచు మనోజ్ ఏమైనా రాజకీయాలలోకి రాబోతున్నారా అందుకే చంద్రబాబు నాయుడుని కలుస్తున్నారా అంటూ పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది.

ఈ విధంగా మంచు మనోజ్ (Manchu Manoj) చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో మంచు మనోజ్ రాజకీయాలలోకి వస్తారా లేక మౌనికను రాజకీయాలలోకి తీసుకువస్తారా అన్న విషయం గురించి చర్చలు మొదలయ్యాయి అయితే మౌనిక రాజకీయాలలోకి వస్తాను అంటే తనకు నా మద్దతు పూర్తిగా ఉంటుందని గతంలో మన కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు మనోజ్ మౌనిక దంపతులు చంద్రబాబు నాయుడుని కలవడం ఆసక్తికరంగా మారింది.

ఇక మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగడమే కాకుండా విద్యాసంస్థలను కూడా ఈయన ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో మోహన్ బాబు కుటుంబానికి సినీ పలుకుబడితో పాటు రాజకీయ పలుకుబడి కూడా ఉందని చెప్పాలి. తండ్రి బాటలోనే మనోజ్ రాజకీయాలలోకి రాబోతున్నారా… ఇలా మనోజ్ చంద్రబాబు నాయుడుని కలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus