ఈరోజు మంచు మోహన్ బాబు గారి సతీమణి నిర్మలా దేవి గారి పుట్టినరోజు. దీంతో మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నీకు అన్ని విధాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది.హ్యాపీ బర్త్ డే అమ్మ’ అంటూ మంచు మనోజ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. మరోపక్క ‘అమ్మా మన కుటుంబాన్ని నిలబెట్టిన దేవతవి. నువ్వు లేకుంటే మేం చిన్నాభిన్నమై పోయేవాళ్ళం.
మీకు ఆరోగ్యం మరియు శాంతిని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ మంచు లక్ష్మీ ఇన్స్టాగ్రామ్లో..! ‘మా మంచు కుటుంబాన్ని భయపెట్టే ఒకే ఒక్క వ్యక్తి.. మై డార్లింగ్ మామ్ .. నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ మంచు విష్ణు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంచు నిర్మలా దేవి గారి అన్ సీన్ పిక్స్ ను ఆమె బర్త్ డే స్పెషల్ గా ఓ లుక్కేయండి :