Manchu Manoj: రామ్ చరణ్ కు స్పెషల్ విషెస్ తెలియజేసిన మంచు మనోజ్

మంచు హీరో మనోజ్ (Manoj) గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈయన భూమి మౌనికను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక మార్చ్ 3వ తేదీ మనోజ్ భూమ మౌనిక మెడలో మూడు ముళ్ళు వేశారు.ఇలా పెళ్లి ద్వారా వార్తల్లో నిలిచినటువంటి మనోజ్ తాజాగా తన అన్నయ్యతో గొడవ పడుతూ సంచలనంగా మారారు.

వారి వ్యక్తిగత కారణాలవల్ల మనోజ్ విష్ణు ఇద్దరు పెద్ద ఎత్తున గొడవ పడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై మంచు కుటుంబ సభ్యులు స్పందిస్తూ ఏ విధమైనటువంటి గొడవలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా విష్ణుతో గొడవ అనంతరం మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాలలో వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా ఈయన మై స్వీట్ బ్రదర్ అండ్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నేడు మెగా పవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు అభిమానులు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మనోజ్ సైతం రామ్ చరణ్,మంచు లక్ష్మితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ తెలియజేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ మై స్వీటెస్ట్ బ్రదర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి సూపర్ డూపర్ బర్త్ డే శుభాకాంక్షలు. నిజంగా చాలా గర్వంగా ఉంది మిత్రమా నువ్వు ఇలాంటి మరెన్నో వసంతాలను చూడాలని ఆశిస్తున్నాను లాట్స్ ఆఫ్ లవ్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ# HBDGlobal Star Ramcharan అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus