టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండో తనయుడు అయిన మంచు మనోజ్ అభిమానులకు గుడ్ న్యూస్ షేర్ చేసింది అతని భార్య మౌనిక. ఫోటోలు, హెడ్డింగ్లు చూస్తే ఈ పాటికే మీకు విషయం అర్ధమైపోయుంటుంది అనుకోండి..!మంచు మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని మనోజ్ భార్య మౌనిక స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ‘నా పక్కన ఉన్న వాళ్ళ వల్ల నా జీవితం ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తూనే ఉంది.
మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా కూడా చేస్తుంది అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది మౌనిక. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ను హైలెట్ చేస్తూ ఆమె ఫోటోలు ఉండటం గమనార్హం. భూమా మౌనికకి ఆల్రెడీ ఇది వరకు ఓ పెళ్లైంది. ఆమెకు ఓ బిడ్డ కూడా ఉన్నాడు. ఇక గతేడాది మార్చి నెల 3వ తేదీన మనోజ్ – మౌనిక..ల పెళ్లి జరిగింది. మంచు లక్ష్మీ నివాసంలో కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.
అంతకు ముందు (Manchu Manoj) మంచు మనోజ్ కి ప్రణతి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వాళ్ళు విడాకులు తీసుకున్నారు. దీంతో మనోజ్ పర్సనల్ గా బాగా డిస్టర్బ్ అయ్యాడు. డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయాడు. గతేడాది భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు.
సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!